Wednesday, January 1, 2025
HomeTelanganaపారిశుధ్యాన్ని పట్టించుకొని పాలకులు: హరీష్ రావు

పారిశుధ్యాన్ని పట్టించుకొని పాలకులు: హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పదవీ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్స్..
  • మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సర్పంచులు, కౌన్సెలర్లు ఐదేళ్లపాటు ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేశారు.
  • కరోనా కష్ట కాలంలో సైతం విధులు నిర్వహించారు. మిమ్మల్నందర్నీ అభినందిస్తున్నాం.
  • దుబ్బాకలో ప్రభాకర్ అన్నను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు హృదయపూర్వక అభినందనలు.
  • ప్రజాప్రతినిధులను సన్మానించాలన్న మంచి ఆలోచన చేసిన ప్రభాకరన్నకు ధన్యవాదాలు.
  • పదవీ విరమణ పదవికే తప్ప ప్రజాసేవకు ఉండదు. మీకు ఇకపైనా అదే గౌరవం ఉంటుంది. ఇదే ఆఖరు కాదు. మీకు మళ్లీ పదవులు వస్తాయి.
  • రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. గెలుపు ఓటము శాశ్వతం కాదు. బీఆర్ఎస్ మళ్లీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది.
  • కాంగ్రెస్ ప్రభుత్వ గ్రామ పంచాయతీయలకు నిధులు ఇవ్వడం లేదు. పారిశుధ్య, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాల్లేవు.

  • పల్లెలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మీకు కూడా ఏడు నెలలుగా జీతాలు రావట్లేదు.
  • కాంగ్రెస్ పాలనను గాలికి వదిలేసింది. ప్రతిపక్షాలను వేధించడం, పగ సాధించడమే పనిగా పెట్టుకుంది.
  • రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. శాంతిభద్రతలు గాడి తప్పాయి.
  • ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు తన సమస్యను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
  • రైతుబంధు సమయానికి ఇవ్వడం లేదు. అవ్వాతాతల ఫించన్ పెంచలేదు. వస్తున్న రెండు వేలు కూడా పెండింగులో పెట్టారు.
  • పొలాలకు సాగునీళ్లు లేవు. కరెంట్ లేదు. మోటర్లు కాలిపోతున్నాయి. కేసీఆర్ కిట్ బంద్ చేశారు.
  • అన్నిటికీ కోతలు పెట్టడం, బంద్ పెట్టడం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.
  • తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ రెప్పపాటు కూడా పోలేదు, ఇప్పుడెందుకు పోతోంది?
  • మీరు ఎన్నికల్లో గెలవడానికి నేను, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తాం.
  • మీరు ధైర్యంగా ఉండండి. ప్రజల కష్టసుఖాల్లో భాగం కండి.
RELATED ARTICLES

తాజా వార్తలు