Wednesday, January 1, 2025
HomeEducationTGPSC: 1:50 నిష్పత్తిలోనే..

TGPSC: 1:50 నిష్పత్తిలోనే..

గ్రూప్‌-1 మెయిన్స్‌పై టీజీపీఎస్సీ స్పష్టత
హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌పై  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌పై టీజీపీఎస్సీ స్పష్టతనిచ్చింది. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నది.

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్..
గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

  • జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ పేపర్) – అక్టోబర్ 21
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్‌మెంట్) – అక్టోబర్ 25
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇంటర్‌ప్రిటేషన్ ) – అక్టోబ్ 26
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27
RELATED ARTICLES

తాజా వార్తలు