Saturday, January 4, 2025
HomeTelanganaBRS MLA: బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ లోకి?

BRS MLA: బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ లోకి?

ఆగని ఆపరేషన్ ఆకర్ష్

గద్వాల: భారాసకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికంగా ఎమ్మెల్యేకు, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విబేధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్లో చేరారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. గురువారంతో జడ్పీ చైర్పర్సన్ సరిత పదవీకాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా భారాసను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని సంప్రదించగా… “పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్యకర్తల అభిప్రాయం తీసుకుని చేరికపై నిర్ణయం తీసుకుంటా” అని అన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు