Sunday, December 29, 2024
HomeHealthZika virus: ‘జికా’ వస్తోంది తస్మాత్ జాగ్రత్త!

Zika virus: ‘జికా’ వస్తోంది తస్మాత్ జాగ్రత్త!

‘జికా’ వస్తోంది తస్మాత్ జాగ్రత్త!

– రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
– మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో ఆందోళన
– సంసిద్ధంగాలేని తెలంగాణ వైద్యశాఖ
– కనీస చర్యలూ తీసుకోని వైనం
– ఇప్పటికే రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల విజృంభణ

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జికా వైరస్‌(Zika virus) విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం పుణెలో ఒక్క రోజే ఆరు జికా వైరస్‌ వ్యాధి (జడ్‌వీడీ) కేసులు నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈమేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎ్‌స) డాక్టర్‌ అతుల్‌గోయల్‌ అడ్వైయిజరీ జారీ చేశారు. జికాపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గర్భిణులను స్ర్కీనింగ్‌ చేయాలని కేంద్రం కోరింది. జికా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గర్భిణుల్లో పిండం ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించింది. ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని, ఆ అధికారి జికా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే దోమల పెరుగుదల నివారణకు చర్యలు చేపట్టాలని కోరింది. జికా కేసులు నమోదైతే వెంటనే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ వెక్టర్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీవీబీడీసీ)కు రిపోర్టు చేయాలని, అనుమానిత నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపాలని సూచించింది. అలా గే ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని వైరస్‌ పరిశోధనా కేంద్రాలకు కూడా శాంపిళ్లను పంపాలని ఆదేశించింది.

జికా వైరస్ లక్షణాలు ఏంటి?

ఈ జికా వైరస్ సోకిన వారికి జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు