Friday, January 3, 2025
HomeCinemaMega Star: డబ్బింగ్ మొదలైన ‘విశ్వంభర’..

Mega Star: డబ్బింగ్ మొదలైన ‘విశ్వంభర’..

 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్నీ క్రాఫ్ట్స్‌లో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుండ‌గా తాజాగా మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ త‌మ సోష‌ల్ మీడియాల ద్వారా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో హ‌నుమంతుడి భ‌క్తుడిగా మెగాస్టార్‌ చిరంజీవి క‌నిపించ‌నుండ‌డం విశేషం.
త్రిష ఈ సినిమాలో ప్రధాన కథానాయకురాలిగా నటిస్తుండగా, ఇంకా అషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభి, మీనాక్షి చౌదరిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.
ఈ చిత్రంలో ‘రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ’ వంటి అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన కునాల్ కపూర్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025 జనవరి 10న విడుదల కానుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు