Thursday, January 2, 2025
HomeCinemaORR: పార్థి గ్యాంగ్‌ అరెస్ట్‌

ORR: పార్థి గ్యాంగ్‌ అరెస్ట్‌

పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద పోలీసుల కాల్పులు.. 

జాతీయరహదారిపై పార్కింగ్‌ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్‌ శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇటీవల నేషనల్‌ హైవేవై పార్కింగ్‌ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అప్రమత్తమైన నల్లగొండ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. దీంతో వారిపై దొంగలు కత్తులతో ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు దొంగలను అదపులోకి తీసుకున్నారు. వారిని నల్లగొండకు తరలించనున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు