Varalaxmi Sarathkumar| తమిళ్ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది వరలక్ష్మీ శరత్ కుమార్. మొదట్లో హీరోయిన్గా నటించిన వరలక్ష్మీ తర్వాత సపోర్టింగ్ పాత్రలు ఎక్కువగా చేస్తుంది. ఇటీవలే హనుమాన్ సినిమాలో హీరో సిస్టర్ గా నటించి అదరహో అనిపించింది. ఇక ఇప్పుడు శబరి అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మీ.. స్టార్ హీరో కూతురును అయ్యి కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు తెలియజేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నేను సినిమా పరిశ్రమలోకి రావడం నాన్నకు అస్సలు ఇష్టం లేదు. మొదట్లో స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. అయితే తమిళనాడుకి చెందిన ఓ టీవీ ఛానెల్ యజమాని ఓ సారి తన దగ్గరకు వచ్చి తన దగ్గర ఓ ప్రాజెక్ట్ ఉందని,కలిసి పని చేద్దామని చెప్పాడు. అప్పుడు ఒకే అని చెబితే, బయటకలుద్దాం అన్నాడు. ఎందుకు అని అడిగితే రూమ్ బుక్ చేస్తా.. కలిసి మాట్లాడుకుందాం అని అన్నాడు. హీరో కూతురు అయిన నాకే ఇలా ఉంటే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి పరిస్థితి ఏమిటి? అనిపించింది. వెంటనే అతనిపై కేసు పెట్టినట్టు వరలక్ష్మీ పేర్కొంది.
అయితే ఇది జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు అయినట్టు తెలిపింది. తన కెరీర్లో కమిట్ మెంట్ అడగకుండా ఎవరు లేరు. కొన్ని సందర్భాలలో కొన్ని అవకాశాలు వదులుకున్నా. ఇప్పుడు మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయని వరలక్ష్మీ పేర్కొంది. ఇక ఇటీవల వరలక్ష్మీ నిశ్చితార్థం జరుపుకుంది. త్వరలో ఆమెపెళ్లి పీటలు ఎక్కబోతుంది. పెళ్లైన తర్వాత కూడా వరలక్ష్మీ సినిమాలు చేయనుంది. ఇక శబరిలో తల్లి పాత్ర పోషించినట్టు తెలియజేసింది వరలక్ష్మీ. ఇలాంటి సినిమా ఇంతకు ముందు నేను చెయ్యలేదు. ఈ సినిమాలో నేను మదర్ గా నటిస్తున్నా.. ఈ సినిమాలో ఓ తల్లి కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథాంశం అన్నట్టుగా తెలియజేసింది.