Saturday, January 4, 2025
HomeTelanganaTGSRTC: మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

TGSRTC: మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్..
బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను TGSRTC ఎండీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. ఆర్టీసీ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం అభినందనీయం అన్నారు.

 

ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో అవస్థపడుతన్న గర్భిణీకి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆపదలో ఉన్న గర్భిణీకి సాయం చేసి ఆర్టీసి బస్సులో ప్రసవం చేసిన సిబ్బందికి, మహిళా ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ బహదూర్ పురలో టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసిన ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ, మహిళా ప్రయాణికులను అభినందించారు. సమయస్పూర్తితో వ్యవహరించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అన్నారు. వారికి సరైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. సామాజిక సేవలో ఆర్టీసీ సిబ్బంది కూడా ముందు నిలవడం అభినందనీయం అన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.

ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు