Monday, December 30, 2024
HomecrimeWife and Husband: తన జల్సాల కోసం ఏకంగా భర్తనే..

Wife and Husband: తన జల్సాల కోసం ఏకంగా భర్తనే..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భార్య తన భర్త జీవించి ఉన్నప్పటికీ.. చనిపోయినట్లు ప్రకటించింది. అంతేకాదు.. డెత్ సర్టిఫికెట్ సృష్టించి మరీ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుంది. ఆపై హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే, ఈ విషయం బ్రతికున్న భర్తకు తెలియడంతో అతను తన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. మరి ఇంతకీ ఏమైంది? భార్య తన భర్తను ఎందుకు చనిపోయిందని చెప్పింది? విషయం తెలిసిన భర్త ఏం చేశాడు? ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

యూపీలోని ఖాద్రా ప్రాంతానికి చెందిన ఇజార్ అహ్మద్‌కు ఏడాది క్రితం ఫరీనా బానోతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఫరీనా తన భర్తన వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, పుట్టింటికి వెళ్లిన ఫరీనా.. తన అవసరాల కోసం, జల్సాల కోసం సరికొత్త మోసానికి తెరలేపింది. ఓ ఫైనాన్స్ కంపెనీ వద్దకు వెళ్లిన ఫరీనా.. లోన్ కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో తన భర్త చనిపోయాడంటూ నమ్మించింది. ఫేక్ డెత్ సర్టిఫికెట్ కూడా సృష్టించింది. లోన్‌ తీసుకునే సమయంలో అడ్రస్‌గా భర్త ఇంటి చిరునామానే పేర్కొంది.

అసలు కథ ఇలా బయటపడింది..

ఫైనాన్స్ కంపెనీ వారు ఫరీనాకు లోన్ మంజూరు చేశారు. ఆ డబ్బులో ఫరీనా ఎంజాయ్ చేసింది. మొదటి విడత వాయిదా కట్టే సమయం వచ్చింది. ఆమె కాంటాక్ట్ వివరాలు లేకపోవడంతో లోన్ తీసుకునే సమయంలో పేర్కొన్న చిరునామాకు ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్స్ వెళ్లారు. అక్కడ ఫరీనా భర్త ఉండగా.. అతనికి విషయం చెప్పారు. దాంతో ఇజార్ అహ్మద్ షాక్ అయ్యాడు. వెంటనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఇజార్ కోర్టును ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని కోర్టుకు వివరించాడు. కేసు విచారించిన ధర్మాసనం.. ఫరీనా, ఫైనాన్స్ కంపెనీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు.. ఫరీనా, ఫైనాన్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. ఫరీనా, కంపెనీ మేనేజర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

నకిలీ మరణ ధృవీకరణ పత్రం..

ఇజార్ మాట్లాడుతూ.. ‘ఫరీనా లోన్ ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది నా ఇంటికి వచ్చారు. అప్పుడు ఫరీనా నా మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేసి ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు ఆమె వాయిదా చెల్లించలేకపోతోంది. ఫైనాన్స్ కంపెనీ నా దగ్గర వాయిదాలు అడగడానికి వచ్చింది. ఫరీనా చేసిన పని గురించి తెలియగానే నేనూ షాక్ అయ్యాను. మోసపూరితంగా రుణం తీసుకుంది. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాను. పోలీసులు సహకరించలేదు. కోర్టును ఆశ్రయించాను. కోర్టు ఆదేశాల మేరకు ఫరీనా, ఫైనాన్స్ కంపెనీ మేనేజర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఫరీనా ఇప్పటికీ తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంది. త్వరలో ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అప్పు చేసిన డబ్బుతో ఫరీనా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. అయితే, డబ్బులు అయిపోవడంతో వాయిదా కట్టలేకపోయింది. ఆమె రుణ వాయిదా చెల్లించి ఉంటే.. ఈ మోసం గురించి నాకు ఎప్పటికీ తెలిసిఉండేది కాదు.’ అని చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు