Friday, January 3, 2025
HomeTelanganaMetro Train: డీపీఆర్‌ మరింత జాప్యం

Metro Train: డీపీఆర్‌ మరింత జాప్యం

  • పూర్తి కానీ రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక

మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) మరింత జాప్యం కానున్నది. రెండు నెలల కిందట పూర్తి కావాల్సిన డీపీఆర్‌ మరో నెల రోజులు గడిస్తేనే తప్ప.. పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రయోజనం కోసం రెండో దశ మెట్రోను త్వరితగతిన పూర్తి చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఎంతో హడావుడిగా పాతబస్తీ మెట్రో పనులు మొదలు పెడుతున్నామని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 నెలలు గడిచినా పాతబస్తీ మెట్రో పనులు మొదలు కాకపోగా, రెండో దశ డీపీఆర్‌ సైతం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.

ఇదే విషయమై హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు మాత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సమగ్ర రవాణా ప్రణాళిక (కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌-సీఎంపీ) అధ్యయనం పూర్తి కావాల్సి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఉమ్టా (యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ) సీఎంపీని నిర్వహిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే 3 నుంచి 12 నెలల సమయం పడుతుందని ఒకవైపు ఉమ్టా అధికారులు పేర్కొంటున్నారు. మూడు దశల్లో దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రెండో దశ డీపీఆర్‌ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉన్నదని అధికారులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES

తాజా వార్తలు