కొడుకుని చూసి చలించి పోయిన తల్లి విజయమ్మ
దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. భార్య విజయలక్ష్మి, కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్, కుమార్తె షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు తండ్రికి నివాళులర్పించారు. తొలుత విజయలక్ష్మి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకోగా.. ఆ తర్వాత జగన్.. షర్మిల చేరుకున్నారు. కుమారుడిని చూసిన ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిని హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు జగన్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత బహిరంగంగా తల్లి కొడుకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి.