Wednesday, January 1, 2025
HomeSportsTeam India T20 World Cup Squad | టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు టీమ్ఇండియా.. జ‌ట్టు కూర్పు...

Team India T20 World Cup Squad | టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు టీమ్ఇండియా.. జ‌ట్టు కూర్పు ఎలా ఉందంటే?

Team India T20 World Cup Squad | మ‌రో నెల‌రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త జ‌ట్టును (Team India T20 World Cup Squad)బీసీసీఐ ప్ర‌క‌టించింది. అంతా అనుకున్న‌ట్లే హార్దిక్ పాండ్య‌, రిష‌బ్ పంత్, చాహ‌ల్‌ జ‌ట్టులో స్థానం సంపాదించారు. స్టార్ ఆట‌గాళ్లు కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌పై వేటుప‌డింది. ఫాస్ట్ బౌల‌ర్లు సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్ త‌మ స్థానాల‌ను నిలుపుకున్నారు.
జూన్ 1న వెస్టిండీస్‌, అమెరికా వేదిక‌గా టీ20 ప్రపంచకప్ జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. టీమ్ఇండియా కూర్పుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చల త‌ర్వాత అధికారిక ప్రకటన వెలువడింది. రోహిత్ నాయ‌క‌త్వంలో 15 మందితో జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఐపీఎల్‌లో అంత‌గా రాణించ‌లేక‌పోతున్న య‌శ‌స్వి జైస్వాల్‌పై విశ్వాస‌ముంచిన జ‌ట్టు మేనేజ్‌మెంట్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్‌పై గంపెడాశ‌లు పెట్టుకున్న రింకూ సింగ్ రిజ‌ర్వ్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అదేవిధంగా శుభ్‌మ‌న్ గిల్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, అవేశ్ ఖాన్‌ను కూడా అద‌న‌పు ఆట‌గాళ్లుగా తీసుకున్నారు.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స్క్వాడ్ ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

ఏ గ్రూప్‌లో ఏ జ‌ట్టు ఉందంటే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం మొత్తం 20 జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ జట్ల‌ను 4 గ్రూపులుగా విభ‌జించారు. ప్ర‌తిగ్రూప్‌లో 5 టీమ్‌లు ఉన్నాయి. దాయాది జ‌ట్లు భార‌త్‌, పాక్‌లు ఒకే గ్రూపులో ఉండ‌టం విశేషం. ఈ రెండు జ‌ట్లు జూన్ 9న న్యూయార్క్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
గ్రూప్-ఏ: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ
గ్రూప్-బీ: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్-సీ: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
గ్రూప్-డీ: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

 

RELATED ARTICLES

తాజా వార్తలు