ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును టీజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తలు కవర్ చేయడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయటమేంటి..? కనీసం మీడియా ప్రతినిధులు అనే సోయి లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే… మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అవుతుంది. జర్నలిస్టుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
పల్లె రవి కుమార్ గౌడ్(అధ్యక్షుడు)
మహేశ్వరం మహేంద్ర
(డిప్యూటీ జనరల్ సెక్రటరీ)
తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్-TJF