Wednesday, January 1, 2025
HomeTelanganaHarish Rao: కోత‌లు

Harish Rao: కోత‌లు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు జిల్లాల్లో క‌రెంట్ కోత‌లు స‌ర్వ సాధార‌ణంగా మారాయ‌ని ప్ర‌జ‌లు, రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రెంట్ కోత‌ల‌ను నివారించాల‌ని విద్యుత్ అధికారుల‌కు రోజు కొన్ని వేల విన‌తులు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎప్పుడంటే ఎప్పుడు క‌రెంట్ కోత‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో గంట‌ల కొద్ది క‌రెంట్ కోత‌లు ఉంటున్నాయ‌ని వ‌చ్చిన వార్తా క‌థ‌నాల‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ న‌గ‌రంలో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం అని పేర్కొన్నారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్‌, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరువయ్యారు అని తెలిపారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

సీఎం ప్రసంగిస్తుండగా నిన్న‌ కరెంట్‌ కట్‌

పాలమూరు జిల్లాలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా 10 నిమిషాల తర్వాత 6:42 గంటల సమయంలో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్యాన్‌లు, లైట్లు ఆఫ్‌ అయ్యాయి. ఫంక్షన్‌హాల్‌లో ఉన్న జనరేటర్‌ సహాయంతో కార్యక్రమం కొనసాగింది. సీఎం వెళ్లిపోయాక విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడా నిమిషం కూడా కరెంట్‌ పోవడం లేదని సీఎం చెప్పారు.. కానీ ఆయన ప్రసంగంలోనే కరెంట్ పోవ‌డం గ‌మ‌న్హ‌రం.

  • జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు

ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.

డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?

జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే.

జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

RELATED ARTICLES

తాజా వార్తలు