Sunday, December 29, 2024
HomeNationalBadri Nath Hughey Coles: బద్రీనాథ్ హైవే క్లోజ్..

Badri Nath Hughey Coles: బద్రీనాథ్ హైవే క్లోజ్..

బద్రీనాథ్ హైవే క్లోజ్..

చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు. ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతుండటంతో కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2,000 మంది యాత్రికులు హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 241 ఎక్స్ కవేటర్లను అక్కడ మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్ దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు