Wednesday, January 1, 2025
HomeCinemaAnasuya|ఎమోష‌న‌ల్ అయితే కండ‌రాల నొప్పి, బ్రీతింగ్ స‌మ‌స్య‌.. ఆక్సీజ‌న్ కూడా పెట్టించుకున్నాన‌న్న అన‌సూయ‌

Anasuya|ఎమోష‌న‌ల్ అయితే కండ‌రాల నొప్పి, బ్రీతింగ్ స‌మ‌స్య‌.. ఆక్సీజ‌న్ కూడా పెట్టించుకున్నాన‌న్న అన‌సూయ‌

Anasuya| అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ అనే షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చి రంగ‌స్థ‌లం చిత్రంలో త‌న న‌ట‌న‌తో న‌టిగా ఇప్పుడు ఎదుగుతూ ఉంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకునే ప‌రిస్థితి అయితే రాలేదు. బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప,ఖిలాడి చిత్రాలు న‌టిగా అన‌సూయ‌కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక సినిమాల‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అన‌సూయ సోష‌ల్ మీడియాలో కూడా తెగ సంద‌డి చేస్తుంటుంది. ఇప్ప‌టికీ కూడా త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ అభిమాన గ‌ణం కూడా క్ర‌మంగా పెరుగుతుంది.

38 ఏళ్ల వయస్సులో కూడా ఈ రేంజ్‌లో రచ్చ చేస్తుందంటే మాములు విష‌యం కాదు. అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో న‌టించి అల‌రించింది. అయితే అన‌సూయ‌ని చూస్తే ఒక్కోసారి బొద్దుగా, మ‌రోసారి నాజూగ్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వ‌ల‌న అలా మార‌డం లేద‌ని, త‌న‌కి ఉన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌ల‌న అలా జ‌రుగుతుంద‌ని అన‌సూయ అంటుంది. ఓ ఇంట‌ర్వ్యూలో అన‌సూయ మాట్లాడుతూ.. తనకి సీరియస్ బ్రీతింగ్ ఇష్యూ ఉంద‌ని తెలియ‌జేసింది. అయితే తాను అందంగా క‌నిపించ‌డం కోసం డైటింగ్ చేయడం లేద‌ని, ఆరోగ్యప‌రంగా ఎలా ఫీల‌వుతున్నాను అనే దాని కోస‌మే డైట్ చేస్తున్న‌ట్టు పేర్కొంది.

నేను ఎక్కువగా ఎమోషనల్ అయితే కండరాల్లో నొప్పులు, బ్రీతింగ్ సమస్య వ‌స్తుంటుంది. అందుకే అప్ప‌టి నుండి కూడా నేను బ్రీతింగ్ యోగ, ప్రాణాయామం చేస్తున్న‌ట్టు తెలియ‌జేసింది. ఇక ఫిజిక‌ల్‌గా ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు కూడా తెలియ‌జేసింది. ఒక‌సారి బ్రీతింగ్ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఆసుప‌త్రికి వెళ్లి ఆక్సీజ‌న్ కూడా పెట్టించుకున్న‌ట్టు అన‌సూయ పేర్కొంది. నేను లావుగా ఉన్నానని ఏ మాత్రం కూడా ఫీల్ కావ‌డం లేదు. నా వర్క్ నాకు ముఖ్యం అనుకుంటూ ముందుకు వెళ‌తాన‌ని అన‌సూయ స్ప‌ష్టం చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు