Tuesday, December 31, 2024
HomeTelanganaబాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసిబి

బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసిబి

click to view JanaPadham-13-08-2024 E-Paper

బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసిబి

ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని కోరిన బాధితుడు

ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి.

బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్

ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్

పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో మాట్లాడిన జాయింట్ కలెక్టర్

పెద్దంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Big

రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎసిబి ట్రాప్

భూపాల్ రెడ్డి నివాసంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ధరణిలో ఒక పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన అడిషనల్ కలెక్టర్

భూపాల్ రెడ్డి తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోను ఏసీబీ సోదాలు.

రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

నిన్న సాయంత్రం నుండి కొనసాగుతున్న ఏసీబీ రైడ్

లంచము కేసుల్లో జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
— ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితా నుండి 14 గుంటల భూమి తొలగించాలని రూ.8 లక్షలు డిమాండ్
— సోమవారం రాత్రి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టివేత
…..
ధరణి వెబ్సైట్ లోని నిషేధిత జాబితా నుండి 14 గుంటల భూమిని తొలగించుటకు రూ ఎనిమిది లక్షలు డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు రంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడు జక్కిడి ముత్యం ఫిర్యాదు మేరకు కొంగరకలాన్ సంజీవని వనం సమీపంలోని గుర్రం కూడా ఎక్స్ రోడ్ వద్ద సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి లంచం స్వీకరిస్తున్నప్పుడు పట్టుకున్నారు.సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తరఫున లంచం డిమాండ్ చేశాడని, సోమవారము రాత్రి బాధితుని నుండి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన వెంటనే మదన్మోహన్ రెడ్డిని ఎసిబి అధికారులు ప్రశ్నించగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు లంచము స్వీకరించానని అవసరం అనుకుంటే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఫోన్ చేస్తానని అన్నారు. అదే సందర్భంలో మదన్మోహన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఫోన్ చేసి లంచం అందిన విషయాన్ని తెలిపినప్పుడు, స్వీకరించిన లంచాన్ని తనకు అందజేయడానికి పెద్ద అంబర్పేట్ ఓ ఆర్ కు రావాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రాత్రి 10:41 సమయంలో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తన అధికారిక వాహనము ఇన్నోవా TS07GK0459లో పెద్ద అంబర్పేట్ ఓ ఆర్ ఆర్ దగ్గరకు చేరుకొని సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి వాహనం దగ్గర ఆగారు.రూ 8 లక్షలను జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి అందజేశారు. అదే సందర్భంలో ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ వాహనంలో ఉన్న ఎనిమిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ కారులో దొరికిన బ్యాగ్ నుంచి రికవరీ చేసిన మొత్తానికి ఫినాప్టాలీన్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని ఎసిబి అధికారులు పేర్కొన్నారు. అధికారి తమ అధికార పదవిని దుర్వినియోగం చేసి తనకున్న అధికారులను దుర్వినియోగం చేసి లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసులో A1 గా మదన్ మోహన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్, A2 జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు