Wednesday, January 1, 2025
HomeTelanganaబెజ్జూర్ సహకార సంఘం కార్యాలయాన్ని ముట్టడించిన రుణమాఫీ రైతులు

బెజ్జూర్ సహకార సంఘం కార్యాలయాన్ని ముట్టడించిన రుణమాఫీ రైతులు

Click to view – JanaPadham-13-08-2024 E-Paper

బెజ్జూర్ సహకార సంఘం కార్యాలయాన్ని ముట్టడించిన రుణమాఫీ రైతులు

బెజ్జూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం లో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12-2018 నుండి డిసెంబర్ 09-2023 మధ్య పంట రుణాలు తీసుకున్న రైతులకు లోన్లు రుణమాఫీ చేసి నిధులు విడుదల చేస్తుంటే సంఘం సీఈఓ పర్ష సంజీవ్ కుమార్ రైతుల నుండి డాక్యుమెంట్ తీసుకొని రైతుల అకౌంట్ లో రుణమాఫీ నగదు జమ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్షద్ హుస్సేన్ గారు రైతులతో కలిసి సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపారు………

అర్షద్ హుస్సేన్ గారు మాట్లాడుతూ పంట రుణాలు తీసుకున్న రైతులకు అన్ని బ్యాంకులు ప్రభుత్వం నుండి రుణమాఫీ నిధులు మంజూరైన వెంటనే రైతుల అకౌంట్లో రెండు,మూడు రోజులలోనే జమ చేస్తున్నాయి…..
కానీ,బెజ్జూర్ మండల సహకార సంఘం కార్యాలయంలో రైతుల అకౌంట్లో రుణమాఫీ నిధులను జమ చేయకుండా రైతులకు తీవ్ర ఇబ్బందుల గురి చేసే రోజుల తరబడి రైతులను సహకార సహకార సంఘం కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ వివరించారు…….

రెండు,మూడు రోజుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లో రుణమాఫీ నిధులు జమ చేయకుంటే రుణమాఫీ రైతులతో పెద్ద ఎత్తున సహకార సంఘం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వివరించారు……..

RELATED ARTICLES

తాజా వార్తలు