జనపదం -గురువారం -22-08-2024 E-Paper
యాదాద్రికి మాజీ మంత్రి హరీష్ రావు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలుదేరారు . ఆయన వెంట పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారు.
ఆగస్టు15 లోగా రైతులందరికి రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు.. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ..యాదాద్రి లోని తూర్పు రాజ గోపురం వద్ద పాప పరిహార పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు నిర్వహించామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.