Wednesday, January 1, 2025
HomeTelanganaతెల్లరేషన్ కార్డు దారులకు తీపి కబురు.. చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం

తెల్లరేషన్ కార్డు దారులకు తీపి కబురు.. చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం

జనపదం – శుక్రవారం -23-08-2024 E-Paper

తెల్లరేషన్ కార్డు దారులకు తీపి కబురు
#వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం
#పి.డి.యస్ బియ్యం దారి తప్పితే కఠినచర్యలు
#పట్టుబడితే డీలర్ షిప్ రద్దు
#ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదు
#రేషన్ డీలర్ల ఆదాయం పెంపుకు ప్రణాళికలు
#వారి న్యాయమైన కోర్కెల పరిష్కారం దిశగా అడుగులు
#ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడి,మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
#మహాలక్ష్మి పధకం లబ్ధిదారులకు చేరుతున్న సబ్సిడీ విషయం లబ్ధిదారులకు చేరవేయ్యాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
——————————–
నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం
#హాజరైన రెవిన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
#పాల్గొన్న పౌరసరఫరాలా శాఖా కార్యదర్శి డి.యస్.చవాన్ తదితరులు
——————————–
తెల్ల రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చౌక ధరల దుకణాలన్నింటిలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం జరిగింది. రాష్ట్ర రెవిన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పౌరసరఫరాల శాఖా కార్యదర్శి డి.యస్.చవాన్ లతో పాటు వైద్య ఆరోగ్య ,ఉన్నత విద్య,బి.సి సంక్షేమ, యస్.సి సంక్షేమ,గిరిజన సంక్షేమ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ తదితర మొత్తం ఎనిమిది శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పి.డి.యస్ బియ్యం దారి తప్పితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పి.డి.యస్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు ఉంటుందన్నారు.అదే సమయంలో రేషన్ షాప్ డీలర్ల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు.అంతే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న1629 చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీకి వెంటనే ఉపక్రమించాలన్నారు.ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడి,మధ్యాహ్న భోజనాలలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. తరచు తనిఖీలు నిర్వహిస్తుంటే మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మహాలక్ష్మి పథకం లో బాగంగా లబ్ధిదారులకు వంటగ్యాస్ కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విషయాన్ని వారికి ప్రస్ఫుటంగా చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు