జనపదం – శుక్రవారం -23-08-2024 E-Paper
ఆలెరులో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు..
రుణమాఫీ చేసి కాంగ్రెస్ మోసం చేసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు.
రుణమాఫీ అందరికీ కాదు కొందరికే అంటున్నారు.
గ్యరెంటీల పేరు చెప్పి ఎసెంబ్లీ ఎన్నికల ముందు నమ్మించి మోసం చేశారు.
ఎంపీ ఎన్నికల సమయంలో దేవుళ్ళ మీద ఒట్టు వేసి మోసం చేసిండు.
ఏ ఒక్క ఊరికైనా పోదాం. రుణమాఫీ అయ్యిందా కాలేదు.
మంత్రులను అడ్డుకునే పరిస్థితి వచ్చింది.
అసెంబ్లీలో కొట్లాడినం. బయట కొట్లడుతున్నం
11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కేసీఆర్
రైతు బాగుంటే రాజ్యం బాగుంటది అని కేసీఆర్ ఆలోచన చేశారు
పంటలకు బోనస్ అని బోగస్ చేశారు.
రుణమాఫీని బొగ్గుబాయి కార్మికులకు, ఆర్టిసి ఉద్యోగులకు ఇవ్వడం లేదు.
ఐటి అని నిబంధనలు పెట్టీ కోతలు పెట్టారు.
ఆశా వర్కర్లు, ఆంగన్ వాడీలకు కోత పెట్టారు
కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసిండు.
తక్షణమే కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్ళు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా
ముసలోల్ల ఫించన్ రావడం లేదు
ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు.
కెసిఆర్ గారు త్వరలో రైతుల తరుపున యాత్రకు బయలుదేరుతారు.
కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే యాదగిరి కిషోర్ మీద దాడి చేయడం అమానుషం.
బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులు ఎన్నడు జరగలేదు.