Friday, January 3, 2025
HomeTelanganaహైడ్రా.. హడల్.. నిలదీతలు.. కూల్చివేతలు..

హైడ్రా.. హడల్.. నిలదీతలు.. కూల్చివేతలు..

Janapadham 30-08-2024 E-Paper

హైడ్రా.. హడల్..
నిలదీతలు.. కూల్చివేతలు..
పార్టీ మధ్య దుమారం రేపుతున్న కమిషనర్
దడపుట్టిస్తున్న కమిషన్ తీరు..
విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన విపక్షాలు..
పార్టీల్లో గందరగోళం..

నిద్రలకెళ్లి దిగ్గున ఉల్కిపడ్డటైతాంది.
ఆ మాటకొస్తే తింటున్నరో ఉపాసమే పంటున్నరో. ఏందీ హైడ్రా.. ఎవనికొచ్చిన హైడ్రా. కూల్చుడేంది.? నోటీసులేంది..? ఏమన్న టెన్షనైతుందా..? ఎప్పుడు ఎట్నుంచి వస్తదో తెల్తలేదాయే.. ఏ నోటీసు పంపుతదో ఊహించలేకుండే. అటు జూత్తెనేమో ఖరీదైన బిల్డింగులయే.., ఇటు జూత్తేనేమో కళ్లముందే నేలమట్టం కావట్టే. వద్దనలేక, ఆపుకోలేక నడిమిట్లనే సచ్చుడైతాంది. పగోడికి కూడా రావొద్దురా అయ్యా ఇసొంటి కట్టం. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు.. ఎటెటో పొయ్యి.., మరెంటో మర్లి.. హైడ్రా పేరుతో ఇట్ల జెయ్యవట్టే.

=========================

పార్టీల మధ్య వైరం నాయకుల మీదకు మళ్లిందా.. లేక నాయకుల మధ్య ముదిరిన యవ్వారం పార్టీలకు పాకిందా తెలియదు గానీ హైడ్రా అంటేనే హడలెత్తిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరిపైన విరుచుకుపడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. రుణమాఫీ ముచ్చట పతాక శీర్షికకు చేరిన వెన్వెంటనే హైడ్రాతో రాష్ట్ర సర్కార్ చూపు తిప్పిందని ప్రతిపక్షాలు విరుచుకపడుతుంటే, మేమేం చేసినా లోకకళ్యాణం కోసమే అన్నట్టుగా కాంగ్రెస్ సమాధానమిస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శలు., సాధ్యాలు అసాధ్యాయాల పరంపరలో నిత్యంహైడ్రా ఒడువని ముచ్చటగానే మారుతోంది.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్..
హైడ్రా వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య వైరం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నది. సహజంగానే ప్రతిపక్షాలు అధికార పక్షంపై ఆరోపణలు చేయడం మామూలే., కానీ రెండు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ సర్కార్ వత్తాసు పలుకుతున్నాయని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే అతి విచిత్రం. జన్వాడ కూల్చివేత ఎందుకాగిందని బీజేపీ నిలదీస్తుంటే., అక్కడ ఇరికాడు కావునే ఇక్కడ ఉరికినట్టు చేస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మాటలతోనే యుద్ధం చేసుకుంటూ పార్టీలన్నీ విలువల బట్టలిప్పి నిలబెట్టాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు