Wednesday, January 1, 2025
HomeTelanganaTelangana Rains | వరద.. బురద.. రాజకీయ దురద

Telangana Rains | వరద.. బురద.. రాజకీయ దురద

వరద… బురద..
రాజకీయ దురద..

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా అవసరమా ..?
విలాసంగా విదేశాల్లో ఉన్న కీటీఆర్ కు ఏం తెలుసు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రూ.5 లక్షల సాయం సరిపోద్దా..
పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రూ.25 లక్షలు అన్నారు కదా..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సహాయక చర్యల్లో విఫలం.. : హరీష్
హెలికాప్టర్ దొరకలేదా…నిన్నంత ఏం చేశారు : జగదీశ్వర్ రెడ్డి
అయ్యా ఫాం హౌజ్, కొడుకు అమెరికా నుండి బురద చల్లుతున్నరు
మంత్రి సీతక్క
కేటీఆర్ సోషల్ మీడియాతో బతికేస్తున్నడు : డిప్యూటీ సీఎం భట్టి

సాయమేమోగానీ పార్టీల నడుమ సమరం ముదురుతున్నది. చేయందించడం ఏమోగానీ ఎక్కడివారక్క సలహాలిస్తూ మాటల యుద్ధం చేస్తున్నారు. జనం నీళ్లల్లో లబోదిబోమంటుంటే వీళ్లేమో అందులో కూడా ఓట్ల రాజకీయాలను వెతుక్కుంటున్నారు. ఉన్నవన్నీ పోగొట్టుకుని ఉత్త చేతులతో నిల్చున్న తమను ఆదుకోవడానికి ఎవరైనా రాకపోతారా.. అని ఎదురు చూసుతున్న బాధితులకు అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల కొట్లాట చిరాకు పుట్టిస్తున్నాయి. వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ, ఎవరికి వారుగా దురద అంటించుకుంటున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏండ్ల తర్వాత కురిసిన అతి భారీ వర్షాలకు కనివినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా పూర్తిగా విద్వంసానికి గురి కాగా, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు భారీ వర్షాలకు దాదాపు 25 మందికి పైగా చనిపోగా వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. రాష్ట్రంలో దాదాపు ఐదారు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి. ఖమ్మం జిల్లాలోనైతే ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఖమ్మం పట్టణంలో ఒకటవ అంతస్థుపైకి నీరు నిలిచింది. బారీ వర్షాలకు, వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోలో రూం లో సమీక్షించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చేరుకుని దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పరిస్థితిపై, అంచనాలపై అధికారును బాదితులను మరింత అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న రవాణా, పంటల వ్యవస్థను దగ్గరుండి పరిశీలించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా నీటిపారుదల, రోడ్లు భవనాలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రులు పరిస్థితిపై ఉన్నత స్ఖాయి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ ఖమ్మంలోనే బస చేసారు. వరదల తాకిడికి 150 కి పైగా రైళ్ల రద్దు కాగా 200 రైళ్లను దారి మళ్లించారు. 800 బస్సు సర్వీసులను రద్దును చేశారు. కేసముద్రం మండలం ఇంటిటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే స్టేషన్ ట్రాక్ పునరుద్ధరణ పనులు 500 మందితో కొనసాగుతున్నాయి.
ప్రాజెక్ట్ లు గేట్లు ఎత్తుకున్నయ్
రాష్ట్రంలో కురుస్తున్న బారీ వర్షాలకు ప్రాజెక్ట్ లు నిండుకున్నాయి. శ్రీశైలం సహా అన్ని ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తారు. ఎస్సారెస్పీ 42 గేట్లు ఎత్తుకోగా, మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda barrage) వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంతోప్రాణహిత, గోదావరి నదులు పొంగుతుం డడంతో సోమవారం బరాజ్‌ వద్ద ఇన్‌ఫ్లో 6,79,900 క్యూసెక్కులకు చేరుకోగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.

సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ కు

సచివాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంలో ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతున్నది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 1200 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లా నుంచి ఫిర్యాదులు కావడం గమనార్హం. ఆయా జిల్లాల్లో పరిస్థితుల మేరకు ఇప్పటి వరకు 69 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 2761 మందికి పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.

నేడూ భారీ వర్ష సూచన
– 11 జిల్లాల్లో వానలుంటాయి
– సిఎస్ శాంతి కుమారీ సమీక్ష
రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించిందని, ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రానున్న 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలున్నాయన్నారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వరద పరిస్థితులు, పునరావాసం, సహాయక చర్యలపై సమీక్షించారు. డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ టెలీకాన్ఫరెన్స్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించి.. ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికు గత నాలుగైదు రోజులుగా వానలుపడుతున్నాయని, రానున్న భారీ వర్షాలతో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. పోలీస్‌, తదితరశాఖలతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్‌ జిల్లాకు 31 సభ్యులు, నాలుగు బొట్లు ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. నీటి పరిమాణం ఎక్కువైతే పరీవాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని సూచించారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరద గురించి తెలుసుకొని జాగ్రత్తలు చేపట్టేందుకు మహారాష్ట్ర అధికారులతో కోఆర్డినేట్‌ చేసుకోవాలని సూచించారు. కల్వర్టులు, వాగుల వద్ద సంబంధితశాఖల అధికారులతో జాయింట్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా తమను సంప్రదించాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాలు చేసి 24గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి క్రేన్‌లను సైతం సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

పరిహారం రూ.25 లక్షలు ప్రకటించండి – కెటిఆర్
హైద‌రాబాద్ : రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డినే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించండి. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదు, ముఖ్యమంత్రి గారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అదే విధంగా, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. ఆ హామీని కూడా నెరవేర్చండి. ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ప్రాణనష్టం జరిగింది. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించండి అని కేటీఆర్ సూచించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు