Sunday, December 29, 2024
HomeTelanganaKhammam Floods | మేం విన్నాం.. మేం చూశాం..

Khammam Floods | మేం విన్నాం.. మేం చూశాం..

*మేం విన్నాం.. మేం చూశాం.. **

వరద నష్టాన్ని కళ్లారా చూశాము
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం
కేంద్ర బృందం ప్రతినిధి కల్నల్ కే.పి. సింగ్
ముగిసిన ఖమ్మం పర్యటన

ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందం గురువారం రెండో రోజు జిల్లాలో పర్యటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కెపి. సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కె. కుష్వాహ, టి. నియాల్ కన్సన్, డా. శ్రీ శశివర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి, మోతీనగర్ ప్రాంతాల్లో, రెండో బృందం ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం, తల్లంపాడు- తెల్దారుపల్లి, తనగంపాడు, ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ లలో పర్యటించి, భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ, మున్నేరు ఉధృతిని, ప్రవాహం ఏ మేరకు వచ్చింది, ప్రవాహం ఎంత సమయం మేర నిలిచింది, నష్ట వివరాలను ఫోటో ఎక్జిబిషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు. దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పర్యటించారు. భారీ వర్షాలు, వరదల విధ్వంసాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆ రోజున జరిగిన విలయాన్ని కళ్ళకు కట్టినట్లు అర్థం అవుతుందని, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కల్నల్ కే.పి. సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అఖిలేష్ అగస్త్య, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఆర్డీవోలు జి. గణేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు