Sunday, December 29, 2024
HomeSpiritualPadmavathi Temple | పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు..!

Padmavathi Temple | పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు..!

Padmavathi Temple | తిరుచానూర్‌ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాటు చేస్తున్నది. ఉత్సవాలకు 21న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ చేయనున్నారు. భక్తులు రూ.150 చెల్లించి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం ఇచ్చింది. ఉత్సవాల్లో భాగంగా 23న ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవంపై అమ్మవారు విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భ‌క్తుల‌ను అనుగ్రహిస్తారు.

14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని 14న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాల కారణంగా మే 14న, 21 నుంచి 24 వరకు క‌ల్యాణోత్సవం, సహ‌స్రదీపాలంకార‌సేవ‌, 23న తిరుప్పావ‌డ సేవ‌, 24న లక్ష్మీపూజ పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు