Wednesday, January 1, 2025
HomeTelanganaNominated Posts | దసరా గిఫ్ట్..

Nominated Posts | దసరా గిఫ్ట్..

Janapadham_EPaper_TS_07-10-2024

దసరా గిఫ్ట్..

పదవుల పంపకం షురూ
ఆరు మంత్రి స్థానాల భర్తీ ముహూర్తం ఫిక్స్
ఒక్కరోజే 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లు
నేడో రేపో కార్పొరేషన్ చైర్మన్ల ప్రకటన
రైతు విద్యా కమిషన్ సభ్యుల నియామకం పూర్తి
గవర్నర్ కు రెండు రోజుల్లో ఆర్టీఐ కమిషనర్ల ఫైల్

పండుగ బొనాంజా. లక్కీ లాటరీ. ఇన్నాళ్లు వెయిటింగ్ లో ఉన్న అదృష్టం ఇప్పుడు మెడకు పదవి రూపంలో పట్టుకోబోయే సందర్భం. పార్టీ అధికారం చేపట్టిన నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభఘడియల తరుణం కళ్లముందే సాక్షాత్కరిస్తున్న సమయం. ఇప్పటికే ఒక్కొక్కటిగా ఫుల్ ఫిల్ చేస్తూ హస్తం కోసం అహర్నిశలు కష్టపడిన వారికి అందలం కట్టబెడుతూ వస్తున్న పెద్దలు ఆ పనిని మరింత స్పీడప్ చేశారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో నిమగ్నమవడమే కాకుండా, ఒకే రోజు 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థల చైర్మన్లు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్తో పాటుగా 9 మంది కమిషనర్లను ఒకేసారి నియమించేందుకు కూడా రేవంత్ సర్కార్ విధివిధానాలను రూపొందిస్తున్నది.

==============

జనపదం, హైదరాబాద్ బ్యూరో

రాష్ట్రంలో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీపై దృష్టి సారించింది. ఇప్పటికే 37 కార్పొరేషన్ల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం.. ఇంకా పలు పోస్టులను ఖాళీ పెట్టారు. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్పోస్టుల భర్తీ కోసం సీఎం రేవంత్రెడ్డి.. ఏఐసీసీతో పలుమార్లు చర్చించారు. దీనితోపాటుగా వీసీల నియామ‌కం పూర్తి చేసేందుకు క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. ఇప్పటికే బీసీ, విద్య, రైతు క‌మిష‌న్ల ఛైర్మన్లు ఎంపిక పూర్తి కాగా స‌భ్యుల నియామ‌కంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గతంలోనే ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ కారణంగా కొంత ఆలస్యమైంది. రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతుండ‌డంతో పార్టీ కోసం ప‌ని చేసిన వారితో భ‌ర్తీ చేయాల‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌క‌త్వం భావిస్తోంది. మొద‌టి విడ‌త‌లో 37 మందికి వివిధ కార్పొరేష‌న్లకు ఛైర్మన్లను నియ‌మించిన పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం మ‌రికొంత మందికి రెండో విడ‌త కింద కార్పొరేష‌న్ ఛైర్మన్ల ప‌ద‌వులు ఇచ్చేందుకు సిద్దమ‌వుతోంది. సామాజిక స‌మ‌తుల్యత పాటించి ఈ ప‌ద‌వులు భ‌ర్తీ చేయాల్సి ఉంది. డిమాండ్ అధికంగా ఉండ‌డంతో పార్టీ నాయ‌క‌త్వం ఆచితూచి ముందుకు పోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమించింది.

పార్టీకోసం పనిచేసిన వారికే..
పార్టీ బలోపేతానికి ప‌ని చేసిన వారికే ప‌ద‌వులు ద‌క్కాల‌న్న యోచ‌న‌లో కాంగ్రెస్ క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యేల‌కు కూడా కొన్ని కార్పొరేష‌న్ ఛైర్మన్ ప‌ద‌వులు ఇచ్చే ఆలోచ‌న ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ, పౌర‌స‌ర‌ఫ‌రాలు, మూసీ సుంద‌రీక‌ర‌ణ కార్పొరేష‌న్ త‌దిత‌ర ముఖ్యమైన ప‌ద‌వులు ఎమ్మెల్యేల‌కు ఇస్తార‌న్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతోంది. బీసీ క‌మిష‌న్‌ను అధిక జ‌నాభా క‌లిగిన బీసీ వ‌ర్గాల‌తో ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ఇందులో మున్నూరు కాపు, యాద‌వ‌, గౌడ్‌, ముదిరాజులు లాంటి అత్యధిక జ‌నాభా క‌లిగిన వారు ఛైర్మన్‌, స‌భ్యులు ఉండేట్లు చూడాల‌ని యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీల‌క‌పాత్ర పోషించిన‌ ఉస్మానియా విశ్వవిద్యాల‌యం యువ‌త‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం భావిస్తోంది.

పీసీసీ కమిటీతో పాటు..
పీసీసీ నూత‌న అధ్యక్ష ఎంపిక పూర్తయింది. ముందుగా అనుకున్నట్టే పీసీసీ నియామకం తర్వాత పూర్తిస్థాయి కార్యవర్గాన్ని భర్తీ చేస్తున్నారు. దీనికోసం పార్టీనేతల జాబితా సిద్ధం చేస్తున్నారు. కొంద‌రి పేర్లతో కూడిన జాబితాను పార్టీ నాయ‌కులు సిద్దం చేశార‌ని తెలుస్తోంది. ఆ జాబితాపై సీఎంతో చ‌ర్చించిన త‌రువాతనే పూర్తి వివ‌రాలు బ‌హిర్గతం అవ‌తాయ‌ని స్పష్టం చేస్తున్నారు.

సమాచార కమిషన్ల జాబితా..
సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్తో పాటుగా 9 మంది కమిషనర్లను ఒకేసారి నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే అప్లికేషన్లు తీసుకున్నారు. వీటిలో అర్హుల జాబితా తీసుకున్నారు. దాదాపు 38 మందితో అర్హుల జాబితా సీఎంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.

గ్రంథాలయ సంస్థకు చైర్మన్లు..
రాష్ట్రంలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్‌లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. కులాల వారీగా చూసుకుంటే ప్రకటించిన వాటిలో రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మంది ఉండగా.. గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు.. ముస్లిం నుంచి ఒకరికి పదవులు లభించాయి. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

వివరాలు…
నిర్మల్ సయ్యద్ అర్జుమంద్ అలీ
సిరిసిల్ల నాగుల సత్యనారాయణ గౌడ్
కరీంనగర్- సత్తు మల్లయ్య
రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి
వనపర్తి – జి. గోవర్ధన్
సంగారెడ్డి – గొల్ల అంజయ్య
కామారెడ్డి – మద్ది చంద్రకాంత్ రెడ్డి
మెదక్ – సుహాసిని రెడ్డి
నారాయణ్‌పేట్ వరాల విజయ్ కుమార్
నాగర్ కర్నూల్ – జి. రాజేందర్
వికారాబాద్ – శేరి రాజేశ్ రెడ్డి
మహబూబ్‌నగర్ మల్లు నరసింహారెడ్డి
జోగులాంబ గద్వాల నీలి శ్రీనివాసులు

RELATED ARTICLES

తాజా వార్తలు