Saturday, January 4, 2025
HomeAndhra PradeshBotsa Satyanarayana | ఎన్నికలే లేకపోతే వారిపై కేసులు పెట్టేవాళ్లం : మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana | ఎన్నికలే లేకపోతే వారిపై కేసులు పెట్టేవాళ్లం : మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana | ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై విమర్శలు చేస్తున్న వారిపై అధికార వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్ట్‌ను తాము కొత్తగా తీసుకురాలేదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఏదైనా అడగాలనుకుంటే తమను కాకుండా బీజేపీని అడగాలని సూచించారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సైతం స్పందించారు.

భూ హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్‌ని పకడ్బందీగా తీసుకువస్తున్నట్లు చెప్పారు. చట్టంపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదని.. జిరాక్స్‌ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ లేకపోతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కేసులు పెట్టేవారమన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని చట్టం చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనలు ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు