Friday, January 3, 2025
HomeAndhra PradeshAnantapur | అనంత‌పురంలో అనుమానాస్ప‌దంగా నాలుగు కంటైన‌ర్లు.. వాటిలో ఎంత డ‌బ్బు ఉందంటే?

Anantapur | అనంత‌పురంలో అనుమానాస్ప‌దంగా నాలుగు కంటైన‌ర్లు.. వాటిలో ఎంత డ‌బ్బు ఉందంటే?

అనంత‌పురం: అసలే ఎన్నిక‌లు.. మ‌ద్యం, డ‌బ్బు ఏరులై పారేకాలం. దీంతో పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా చెక్‌చేస్తున్నారు. ఫ్ల‌యింగ్ స్వ్కాడ్‌తోపాటు పోలీసులు అనుమానం వ‌చ్చిన ప్ర‌తి వాహ‌నాన్ని ఆపి త‌నిఖీలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనంత‌పురం (Anantapur) జిల్లా గ‌జ‌రాంప‌ల్లి వ‌ద్ద హైవేపై నాలుగు కంటైన‌ర్లు వెళ్తున్నాయి. కంటైనర్లపై పోలీస్ స్టిక్కరింగ్ అని ఉన్నప్పటికీ.. ఎన్నికల డబ్బు అని అనుమానంతో పోలీసులు ఆపారు. చూస్తే వాటిలో అంతా డ‌బ్బే. నాలుగు కంటైన‌ర్ల‌లో మొత్తం రూ.2వేల కోట్లు ఉన్న‌ట్లు తేలింది. డ‌బ్బంతా ఎక్క‌డిద‌ని ఆరా తీయగా అది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాద‌ని (RBI) తేలింది.

ఆధారాలన్నింటిని ధృవీకరించుకున్న తర్వాత వాటిని వ‌దిలేశారు. కంటైనర్లు కేరళ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయ‌ని పోలీసులు చెప్పారు. అనుమానం రావ‌డంతో త‌నిఖీ చేశామ‌ని వెల్ల‌డించారు.కాగా, ఎన్నికల నోటిఫికెషన్ విడుదల అయిన నాటినుంచి ఏపీలో వేలాది కోట్ల రూపాయల నగదు, మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.. అంతేకాకుండా.. స‌రైన ఆధారాలు లేని బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కాగా, రాష్ట్రంలో గతంలో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో పట్టుబడిన డబ్బుతో పోలిస్తే.. ఈ సారి భారీగా నగదు పట్టుబడుతున్న‌ది. 18వ లోక్‌స‌భ ఎన్నిక‌లు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ‌రకు మొత్తం ఏడు విడుతల్లో జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే రెండు విడుతల పోలింగ్ పూర్తయింది. అయితే నాలుగో విడుతలో భాగంగా మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు