Sunday, December 29, 2024
HomeSpiritualTTD | రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం

TTD | రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 21 వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించ‌నున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగనున్నది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని 12న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు పాల్గొననున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు