Sunday, December 29, 2024
HomeSpiritualమే 3 రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి ఆక‌స్మిక ధ‌న న‌ష్టం..!

మే 3 రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి ఆక‌స్మిక ధ‌న న‌ష్టం..!

మేషం

విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వృషభం

మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

మిథునం

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌నకార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది.

కర్కాటకం

స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.

సింహం

నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.

కన్య

కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు.

తుల

ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

వృశ్చికం

అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదావేసుకోక తప్పదు.

ధనుస్సు

కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి.

మకరం

గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బందుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభం

ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

మీనం

అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు