హిందూవులు ప్రతి రోజు ఒక్కో దేవుడిని, దేవతను పూజిస్తుంటారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆర్థిక కష్టాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తుంటారు. దీంతో పాటు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఈ వస్తువులు శుక్రవారం కొనుగోలు చేస్తే.. ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఏయే వస్తువులు కొనుగోలు చేయకూడదు.. ఏవి కొనుగోలు చేయాలో తెలుసుకుందాం..
- శుక్రవారం నాడు ఆస్తులు కొనుగోలు చేయకూడదు.
- అప్పులు కూడా చేయొద్దు.
- వంట గది, పూజా గదికి సంబంధించిన వస్తువులను కూడా కొనకూడదు.
- పంచదార కూడా దానం చేయొద్దు.
- బట్టలు కొనుగోలు చేయొచ్చు.
- తెలుపు రంగు వాహనం కొంటే శుభప్రదమే.
- కళలు, సంగీతానికి సంబంధించిన వస్తువులు కొంటే లక్ష్మీదేవి సంతోషిస్తుందట.
ఈ మంత్రాన్ని జపించండి..
ఓం శ్రీ లకీ మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహ్యేహి సర్వ సభ్యం దేహి మే స్వాహా. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.జపం చేసే సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.