Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాల నుంచి నెహ్రూ కుటుంబం దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. 2004 నుంచి అమేథి నుంచి సోనియా గాంధీ, రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 2019లో మాత్రం బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. ఈ సారి సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నుంచి కాంగ్రెస్ పార్టీ కిశోర్ లాల్ శర్మను పోటీలోకి దింపింది.