Wednesday, January 1, 2025
HomeTelanganaCongress | ప‌ల్లె క‌న్నీరు పెడుతుంది కాంగ్రెస్ కుట్ర‌ల‌.. రైత‌న్న‌ల క‌న్నీటి గీత‌మే ఇది..

Congress | ప‌ల్లె క‌న్నీరు పెడుతుంది కాంగ్రెస్ కుట్ర‌ల‌.. రైత‌న్న‌ల క‌న్నీటి గీత‌మే ఇది..

Congress | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ పచ్చని తెలంగాణ పల్లెల్లో నిప్పు పెట్టింది. నాలుగు నెలల పాలనా కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేసింది. ఆంధ్ర వలస పాలకుల మెడ‌లు వంచి పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్కొక్క ఇటుకను పేర్చినట్లుగా ఎంతో ఓర్పు, నేర్పుతో భవిష్యత్‌ తరాలకు సైతం బంగారు బాటలు వేసేలా కనీవినీ ఎరుగని రీతిలో తీర్చిద్దారు. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణకు ప్రపంచ పటంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన పోరాట యోధుడు, క్రాంతదర్శి కేసీఆర్‌. దేశంలో అభివృద్ధి అంటే తెలంగాణ వైపు చూసేలా పెట్టుబడులను ఆకర్షించి బతుకమ్మను పేర్చినట్లు, బోనాలను పుదిచ్చినట్లు పద్ధతిగా ప్రగతి పథంలో నిలిపి ప్రశంసలు అందుకున్నారు. ఇదంతా గతం.

క‌ట్ చేస్తే.. కాంగ్రెస్ పాల‌న‌లో నేడు తెలంగాణ పల్లెలు గుక్కెలు నీళ్లు, బుక్కెడు బువ్వ కోసం చకోర పక్షిలా ఎదురు చేస్తున్నాయి. వరి చేళ్లు, పత్తి చేళ్లు ప్రేమగా తాకి భరోసానిచ్చే ఆపద్భాంవు కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్నాయి. రైతుబంధు, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో జలసిరులు, ధన సిరులు కురిపించిన కేసీఆర్‌ లాంటి నేత కోసం పంట చేళ్లు, సబ్బండ వర్ణాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. అలాంటి నేత మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాయి. కేసీఆర్ పాలనలో పదేండ్లు ప్రగతి పథంలో పయనించిన పల్లెలు..మళ్లీ ఇప్పుడు ఎనకటి వెతలతో ఎక్కెక్కి ఏడుస్తున్నయ్. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో బిక్కుబిక్కుమంటున్నయ్. ఆ వలపోతతో విలపిస్తున్న కన్నీటి గీతమే ఇది..

 

RELATED ARTICLES

తాజా వార్తలు