Saturday, January 4, 2025
HomeAndhra PradeshAarogyasri | ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు షాక్‌.. ప్రైవేటు ద‌వాఖాన‌ల్లో ఆరోగ్యశ్రీ సేవ‌లు బంద్‌

Aarogyasri | ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు షాక్‌.. ప్రైవేటు ద‌వాఖాన‌ల్లో ఆరోగ్యశ్రీ సేవ‌లు బంద్‌

అమ‌రావతి: ఎన్నిక‌ల వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) ప్రైవేటు ద‌వాఖాన‌లు (Private Hospitals) షాక్ ఇచ్చాయి. హాస్పిట‌ల్స్‌లో ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవ‌లు నిలిపివేశాయి. ఈనెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ద‌వాఖాన‌ల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు ఆపేస్తున్నామ‌ని ఇప్పటికే ప్ర‌క‌టించాయి. డిసెంబ‌ర్ నాటికి రూ.12 వేల కోట్ల మేర బ‌కాయిలు పేరుకుపోవ‌డంతో ప్రైవేటు ద‌వాఖాన‌లు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయి. దీంతో దిగొచ్చిన ప్ర‌భుత్వం రూ.560 కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని బకాయిపెట్టింది.

అయితే ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని ఇటీవల రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. దీంతో నాలుగు నెలల్లోనే ప్ర‌భుత్వ బ‌కాయిలు రూ.16 వేల కోట్లకు దాటాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రైవేటు ద‌వాఖాన‌లు ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌ను నిలిపివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి.

దీంతో నెట్ వర్క్ హాస్పిట‌ల్స్‌లో సామాన్యులకు ఈనెల 7 నుంచి, ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఉచిత వైద్య సేవ‌ల‌ను ఆపేశాయి. ఇప్పటికే పలు ద‌వాఖానలు ప్రభుత్వ సిబ్బందికి ఈహెచ్ఎస్ వైద్యసేవలు లేదంటూ బోర్డులు పెట్టాశాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఉద్యోగులు అస‌హ‌నం వ్య‌క్తంచేస్తున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు