Saturday, January 4, 2025
HomeCinemaEesha Rebba| తెలుగ‌మ్మాయిలో ఇంత హాట్ నెస్ దాగి ఉందా.. చూపు తిప్పుకోలేక‌పోతున్నారుగా..!

Eesha Rebba| తెలుగ‌మ్మాయిలో ఇంత హాట్ నెస్ దాగి ఉందా.. చూపు తిప్పుకోలేక‌పోతున్నారుగా..!

Eesha Rebba| వ‌రంగ‌ల్‌కి చెందిన ఈషా రెబ్బా గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో ఈ అమ్మ‌డు క‌ట్టిపడేస్తూ ఉంటుంది. క‌వ్వించే అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తూ హృద‌యాల‌లో అల‌జ‌డి రేపుతుంటుంది. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌లో కూడా అడ‌పాద‌డపా క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం ఇలా ఏ భాష‌కి సంబంధించిన సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చిన కూడా ఈషా రెబ్బా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. అయితే అందం,అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ ద‌ర్శకులు ఆమెని ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర అంశం.

ఇటీవ‌ల ఈషా రెబ్బా ద‌యా లాంటి వెబ్ సిరీస్‌లో న‌టించి అద‌ర‌గొట్టింది. గ్లామ‌ర్‌కి తగ్గ పాత్ర కావ‌డంతో దానికి వెంట‌నే ఓకే చెప్పి అద‌ర‌హో అనిపించింది. మంచి టాలెంట్ ఉన్న ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ప్ప‌టికీ నిర్మాత‌లు మాత్రం ద‌య చూప‌డం లేదు. ఆమె సాంప్రదాయ చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందో, ట్రెడిష‌న్ డ్రెస్‌లోను అదే అందంతో కుర్రాళ్ల‌కి గిలిగింత‌లు పెట్టిస్తుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈషా అప్పుడప్పుడు షేర్ చేసే పిక్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. తాజాగా ఈషా రెబ్బా బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యే ఫొటో షూట్ చేసింది.

త‌న అందంతో కుర్ర‌కారు హృద‌యాలు దోచుకునే విధంగా ఈ భామ ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ఈషా అందాన్ని చూసి ఏమ‌ని వ‌ర్ణించాలంటూ కొంద‌రు కుర్రాళ్లు క‌విత‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈషా రెబ్బా లుక్ కి హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా ఫిదా అవుతూ హాట్ నెస్ అని కామెంట్ పెట్టింది. క‌సిగా చూస్తూ ఆమె ఇచ్చిన పోజులు కిరాక్ అంటున్నారు. ఇక ఈషా రెబ్బా అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. పెద్ద హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు ద‌క్కించుకున్న ఈ భామ ఎక్కువగా సెకండ్ హీరోయిన్‌గానే ఉంది. స‌రైన బ్రేక్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది. మంచి హిట్ ఒక్క‌టి ద‌క్కితే ఈషా రెబ్బా జోరు మామ‌లుగా ఉండ‌దు.

RELATED ARTICLES

తాజా వార్తలు