Saturday, January 4, 2025
HomeBusinessLayoffs | టెకీలకు కలిసిరాని 2024.. ఐటీరంగంలో 80వేలకుపైగా ఉద్యోగాలు కోత

Layoffs | టెకీలకు కలిసిరాని 2024.. ఐటీరంగంలో 80వేలకుపైగా ఉద్యోగాలు కోత

Layoffs | టెక్‌ ఉద్యోగులకు 2024 సంవత్సరం కూడా కలిసిరాలేదు. కొత్త సంవత్సరంలో ఐటీరంగంలోనే భారీగానే ఉద్యోగాలకు కోత పడింది. నాలుగు నెలల కాలంలోనే ఏకంగా 80వేల ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఇందులో ఉన్నారని లేఆఫ్‌.ఎఫ్‌వైఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగించినట్లు నివేదిక తెలిపింది.

ఇటీవల ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో అమెరికాకు చెందిన ‘స్ప్రింక్లర్’, ఫిట్‌నెస్ కంపెనీ ‘పెలోటన్’తో పాటు పలు కంపెనీలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సైతం 200 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా నివేదిక చెప్పింది. అదే సమయంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ సైతం ప్రపంచవ్యాప్తంగా పదిశాతం మంది సిబ్బందిని అంటే దాదాపు 14వేల మందికి ఉద్వాసన పలికిన విషయం విధితమే. కాగా, 2022, 2023 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి, ఐటీ పరిశ్రమలో మందగమనం కారణంగా పెద్ద ఎత్తున టెక్‌ ఉద్యోగులను ఉద్యోగాలు కోల్పోయారు.

RELATED ARTICLES

తాజా వార్తలు