Saturday, January 4, 2025
HomeBusinessGoogle AI Feature | ఇంగ్లీష్‌ నేర్చుకోవాలనుకుంటున్నారా..? సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్‌..!

Google AI Feature | ఇంగ్లీష్‌ నేర్చుకోవాలనుకుంటున్నారా..? సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్‌..!

Google AI Feature | ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ భాషకు ఎంతో ప్రాధాన్యంతో పాటు గౌరవం ఉన్నది. పూర్తి స్థాయిలో భారతీయులు ఇంగ్లీష్‌ను మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులకు హాజరవుతున్నారు. మరికొందరు వివిధ యాప్స్‌ సహాయంతో ఇంగ్లీష్‌ను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇంగ్లీష్‌ నైపుణ్యం పెంచుకునేందుకు యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. డ్యులింగో, బాబెల్ తదితర లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ తరహాలోనే పని చేస్తుంది.

గూగుల్‌ ఈ ఫీచర్‌కి స్పీకింగ్ ప్రాక్టీస్ పేరుతో తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ లోని గూగుల్ యాప్‌ని ఓపెన్‌ చేసి అందులోని ‘ల్యాబ్ సింబల్’ని క్లిక్ చేయాలి. అందులో ‘ఏఐ ఎక్స్ పెరిమెంట్’ విభాగంలో ‘స్పీకింగ్ ప్రాక్టీస్’ ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దాంతో ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్. మాట్లాడడం, పదాలను టైప్ చేయడం ద్వారా దైనందిన సంభాషణలను ప్రాక్టీస్ చేస్తూ మన స్పోకెన్ ఇంగ్లీష్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..!

RELATED ARTICLES

తాజా వార్తలు