Wednesday, January 1, 2025
HomeTelanganaRahul Gandhi | దేశంలో రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi | దేశంలో రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ

గద్వాల: అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చించివేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గద్వాలలో కాంగ్రెస్ జనజాతర పేరిట భారీ బహిరంగా సభ నిర్వహించింది.ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని.. ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య రాజ్యాంగాన్ని రక్షించడానికి జరుగుతోన్న పోటీ అని అన్నారు.

ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు హక్కులను రాజ్యాంగమే కాపాడుతోందని.. కానీ ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. కానీ రాజ్యాంగాన్ని ఎవరూ మార్చాలేరని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. తెలంగాణలో కులగణన చేస్తున్నామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశమంతా తప్పకుండా కుల గణన చేపడతామని ప్రకటించారు. ఈ సర్వేతో దళితులు, ఓబీసీల ఆర్థిక పరిస్థితి తెలుస్తుందని, కుల గణనతో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యునతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని ప్రకటించారు. కుల గణన ద్వారా రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువ పెంచుతామని తెలిపారు. సెంటర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద కుటుంబాల జాబితాను తయారు చేస్తామని, పేద కుటుంబాలకు చెందిన వారి ఖాతాల్లో లక్ష రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. సంపన్న వర్గాల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దేశంలోని 22 కుటుంబాల బాగు కోసమే బీజేపీ పని చేస్తోందని నిప్పులు చెరిగారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అదానీ, అంబానీకి చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు.. కానీ రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు.

ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యం

నిర్మల్: పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్, రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ మధ్య జరుగుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది’ అని నిర్మల్ సభలో వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు రుణమాఫీ చేస్తున్న BJPని ఎవరేం అడగడం లేదని పేర్కొన్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు