India| వన్డే వరల్డ్‌కప్‌ని తృటిలో చేజార్చుకున్న భారత్ కనీసం టీ20 వరల్డ్ కప్ అయిన దక్కించుకోవాలని కసిగా ఉంది. ఇటీవలే బీసీసీఐ టీమిండియా జట్టుకి ఆడబోయే ఆటగాళ్ల లిస్ట్ విడుదల చేసింది. వారిలో ఉన్న చాలా మంది బ్యాట్స్‌మెన్స్, బౌలర్స్ ఐపీఎల్‌లో తేలిపోతున్నారు. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో మెరిసిన శివమ్ దుబే వరల్డ్ కప్‌కి సెలక్ట్ అయిన తర్వాత పరుగులే చేయలేకపోతున్నాడు. ఆదివారం రోజు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 53వ మ్యాచ్ లో శివమ్ దూబే గోల్డెన్ డక్‌గా నిలిచాడు. గత వారం కూడా పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత జరిగిన మరో మ్యాచ్‌లో రాహుల్ చాహర్ బౌలింగ్‌లో తక్కువ స్కోరుకే ఔటయ్యాడు
ప్రపంచ కప్ జట్టుని ప్రకటించకముందు శివమ్ దూబే ఆట చాలా బాగుంది. మొదటి తొమ్మిది గేమ్‌లలో 43.75 సగటు, 170.73 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేశారు. అయితే జట్టు ప్రకటన తర్వాత మనోడి ఫామ్ తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈయనతో పాటు ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చాలా నిరాశపరుస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. ప్రపంచకప్ జట్టులో చేరిన తర్వాత గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఇక అప్పటి వరకు బాగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రపంచ కప్ జట్టులో చేరిన తర్వాత డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చాడు యుజ్వేంద్ర చాహల్. అతను ఇప్పుడు ప్రపంచ కప్ జట్టులోని ఒక సభ్యుడు.
అతని బౌలింగ్ చాలా పూర్‌గా సాగుతుంది. ఈ మధ్య ఒక మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 62 పరుగులతో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ జట్టు ప్రకటించన తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఇక ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కోల్‌కతాపై హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే, విరాట్ కోహ్లి.. మాత్రం అందరికన్నా భిన్నంగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన తర్వాత కూడా పరుగుల వరద పారిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక బుమ్రా ప్రదర్శన బాగానే ఉంది. సిరాజ్ మాత్రం ఫామ్‌లో లేడు. అర్ష్‌దీప్ సింగ్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఇలా చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత అభిమానులలో ఆందోళన నెలకొంది.