Wednesday, January 1, 2025
HomeCinemaNTR|ఎన్టీఆర్‌కి పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పిందిగా.. వీళ్లెక్క‌డి అభిమానులు..!

NTR|ఎన్టీఆర్‌కి పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పిందిగా.. వీళ్లెక్క‌డి అభిమానులు..!

NTR|అభిమానుల పేరుతో కొంద‌రు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ సెల‌బ్రిటీల‌ని ఎన్ని ఇబ్బందుల‌కి గురి చేస్తున్నారో మ‌నం చూస్తూ ఉన్నాం.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా చాలా సంద‌ర్భాల‌లో అభిమానుల వ‌ల‌న ఇబ్బందులు ప‌డ్డాడు. అయితే వారు ఎంత విసిగించిన కూడా చాలా ఓపిక‌గా ఉన్నారు. తాజాగా కూడా అభిమానుల నుండి ఎన్టీఆర్‌కి విచిత్ర ప‌రిస్థితి ఎదురైంది.రీసెంట్ గా ఎన్టీఆర్.. సిద్ధు జొన్న‌ల‌గడ్డ న‌టించిన‌ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యాడు.ఈవెంట్‌కి ఎన్టీఆర్ వ‌స్తున్నాడ‌ని ప్ర‌క‌టించ‌డంతో భారీ ఎత్తున అభిమానులు వ‌చ్చారు. ఎన్టీఆర్‌ని చూడాల‌ని, ఆయ‌న‌తో క‌లిసి ఫొటోలు దిగాల‌ని ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.

అయితే ఈవెంట్‌కి సంబంధించిన ఓ వీడియో కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో తార‌క్ అభిమానుల వ‌ల‌న చాలా ఇబ్బంది పడ్డ‌ట్టు అర్ధ‌మైంది. అభిమానులు కాస్త అత్యుత్సాహం చూపించి ఎన్టీఆర్‌ని చాలా ఇబ్బంది పెట్టేశారు. టిల్లు స్క్వేర్ ఈవెంట్ పూర్తి అయిన‌ తర్వాత ఎన్టీఆర్ తిరిగి కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఎన్టీఆర్ చుట్టూ చేరారు. ఆయ‌న‌తో క‌లిసి ఫొటో దిగాల‌ని, ముట్టుకోవాల‌ని ఆశ‌ప‌డ్డారు. అయితే బౌనర్స్ వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన కూడా అభిమానులు మీద‌మీద‌కి వ‌చ్చేశారు. ఎన్టీఆర్ ను కదలనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ చాలా ఇబ్బంది పెట్టారు.

ఒక అభిమాని అయితే ఏకంగా తారక్ దగ్గరకు చేరుకొని ఆయ‌న కాళ్ల మీద పడబోయాడు. దాంతో తారక్ కింద పడబోయాడు. వెంటనే బౌన్సర్లు తారక్ ను గ‌ట్టిగా ప‌ట్టుకొని అక్క‌డ నుండి తీసుకెళ్లి మెల్లిగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. అయితే అభిమానులు అంత విసిగించిన కూడా తారక్ చాలా ఓపికగా.. సహనంగా ఉండ‌డం చూసి నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్‌కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దేవ‌ర సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

 

RELATED ARTICLES

తాజా వార్తలు