Wednesday, January 1, 2025
HomeCinemaSai Dharam Tej|పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. ప్ర‌చారంలో ఉద్రిక్త‌త‌

Sai Dharam Tej|పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. ప్ర‌చారంలో ఉద్రిక్త‌త‌

Sai Dharam Tej| ఇప్పుడు ఏపీ ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. మ‌రోవైపు ఏపీ ఎన్నిక‌ల‌లో పిఠాపురం నియోజ‌క వ‌ర్గం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అందుకు కార‌ణం ఆ నియోజ‌క వ‌ర్గం నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తుండ‌డమే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు కోసం ఆయ‌న కుటుంబం నుండే కాక ఇండ‌స్ట్రీ నుండి చాలా మంది వ్య‌క్తులు వ‌చ్చి జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్ హాజ‌రు కాగా, ఇప్పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా వ‌చ్చారు. పవన్‌కు మద్దతుగా ఆదివారం రోజు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రచారం చేశారు. ఆ స‌మ‌యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ గెలిపించాలనిసాయి ధరమ్ తేజ్ చెబుతున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి రాయి విసిరారు.

ఆ రాయి సాయి ధ‌ర‌మ్ తేజ్ ప‌క్క నుండి వెళ్లి జ‌న‌సేన కార్య‌కర్త‌కి త‌గిలింది. దీంతో తాటిపర్తికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సాయిధరమ్ తేజ్ కాన్వాయ్ వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు రాళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్‌ను కూడా విసిరారు. అయితే గాయ‌మైన వెంట‌నే శ్రీధ‌ర్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న పరిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని అంటున్నారు. అయితే ఇది వైసీపీ శ్రేణుల పనేనంటూ జనసైనికులు పెద్ద ఎత్తున ఆందోళన చేప‌ట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అక్క‌డి వారిని పంపించారు. అయితే సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా స్టైల్‌లో డైలాగులు చెప్ప‌డంతో జ‌న‌సైనికులకి కావాల్సినంత జోష్ వ‌చ్చింది.

సేనానికి సైనికుడిలా మాత్రమే వచ్చానంటూ, మీ ఓటుకు ఫ్యాన్ రాలిపోవాలని సాయిధ‌ర‌మ్ తేజ్ అన్నాడు. అలాగే ఈవీఎంల్లో అభ్యర్థుల నెంబర్ కూడా చెప్పుకొచ్చాడు. సాయిధరమ్‌తేజ్‌ ప్రచారానికి మంచి స్పందన రావడంతోనే వైసీపీ నేతలు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారంటూ జ‌న‌సైనికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై మాడుగుల నియోజకవర్గంలో ఇలానే రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు వైసీపీ కార్య‌క‌ర్త‌లు. పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో ఈ దాడి జ‌రిగిన పోలీసులు సైలెంట్‌గా ఉన్నార‌ని అంటున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు