Thursday, January 2, 2025
HomeSportsTeam India New Jersey| టీ20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కొత్త జెర్సీ.. సోషల్‌ మీడియాలో...

Team India New Jersey| టీ20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కొత్త జెర్సీ.. సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్‌..!

Team India New Jersey | ఈ ఏడాది వెస్టిండిస్‌, అమెరికా వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ జరుగనున్నది. జూన్‌ ఒకటి నుంచి మొదలవనున్న మెగా ఈవెంట్‌కు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. టోర్నీలో 20 జట్లు పాల్గొనున్నాయి. పొట్టి కప్‌ కోసం భారత జట్టును టీమిండియా ప్రకటించింది. తాజాగా కొత్త జెర్సీలను సిద్ధం చేసింది. టీమిండియా జెర్సీతో పాటు పాక్‌ బోర్డు సైతం జెర్సీని విడుదల చేసింది. అయితే, కొత్త జెర్సీలు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తాయి. టీమిండియా జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఉండగా.. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ కలర్‌లో జెర్సీని సిద్ధం చేసింది. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

కొందరు సర్ఫెక్సల్‌ ప్యాకింగ్‌ కవర్‌లా ఉందని పేర్కొనగా.. మరికొందరు ‘ఇన్‌స్పైర్డ్ బై హార్పిక్ టాయిలెట్ క్లీన‌ర్’ అంటూ కామెంట్ చేశారు. పలువురు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి డిజైనర్‌ని సెలెక్ట్‌ చేసుకొని జెర్సీని రూపొందించి ఉంటే బాగుండేదన్నారు. మరికొందరు ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది డ్రెస్‌ తరహాలో ఉందని కొందరు.. జీపీఎల్‌ ప్రోగ్రామ్‌లో జెతాలాల్‌ జెర్సీని కాపీ కొట్టారని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. ఇంత‌కుముందు ఇదే తరహా జెర్సీని 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో భారత క్రికెటర్లు ధరించడం గమనార్హం. ఇక పాక్‌ జెర్సీపై సైతం నెజిటన్స్‌ సెటైర్లు వేశారు. పాక్ జెర్సీ ఇన్‌స్పైర్డ్ బై ఫ్రెష్‌ స్పెరిమింట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు