Sunday, December 29, 2024
HomeSpiritualTTD | సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్రుడి వైభవం

TTD | సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్రుడి వైభవం

TTD | తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. వాహ‌న‌సేవ‌లో తిరుమల పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసార‌ధి, సూపరింటెండెంట్‌ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు