Sunday, December 29, 2024
HomeTelanganaCM Revanth Reddy | చంద్ర‌బాబు నాకు గురువు కాదు.. స‌హ‌చ‌రుడు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | చంద్ర‌బాబు నాకు గురువు కాదు.. స‌హ‌చ‌రుడు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: నోటికి ఇష్టం వ‌చ్చినట్టు మాట్లాడేవారిని టీవీల్లో చూపించ‌డం మానేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆ సమ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌కాలంటే మీడియాల్లో ఒక‌రిద్దరిని జైలుకు పంపిస్తే స‌రిపోతుంద‌ని చెప్పారు. ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న జ‌వాబిచ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో చీర‌లు, లంగ‌లు, బ‌నియ‌న్, డ్రాయ‌ర్ల భాష కొన‌సాగుతోంది. తెలంగాణ ప్ర‌జ‌లకు ఈ భాష నుంచి విముక్తి ఉందా..? లేదా..? అని సీఎం రేవంత్ రెడ్డిని మీడియా ప్ర‌తినిధి అడిగారు.

దీనికి రేవంత్ స్పందిస్తూ.. అస‌లు స‌మ‌స్య‌ మీ ద‌గ్గ‌రే ఉంది. మిమ్మ‌ల్ని ఒక‌రిద్ద‌రిని జైలుకు పంపిస్తే కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. ఇట్ల మాట్లాడ‌గానే వాటిని ప్ర‌సారం చేయ‌కుండా బ్యాన్ చేయాలి. ఇలా మాట్లాడే వారిని చూపించ‌డం బంద్ చేయాలి. సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువ ఉంది. పొలిటిక‌ల్ రెస్పాన్సిబిలిటీ మాది. పొలిటిక‌ల్ యాంబీష‌న్స్ మాకు ఉంటాయి. సామాజిక బాధ్య‌త అమ‌లు చేయాల్సినోళ్లు మీరు. అలాంటి భాష మాట్లాడే వారి ప్ర‌సంగాల‌ను నియంత్రించాలి లేదా నిషేధించాలి. అప్పుడే ఈ స‌మాజానికి బాధ త‌ప్పుద్ది అని రేవంత్ గ‌డుసుగా స‌మాధానం ఇచ్చారు.

శిష్యుడి కోసం తెలంగాణ‌లో టీడీపీని పోటీ పెట్ట‌కుండా విర‌మింప‌జేశారు. ఇప్పుడు గురువు గారు అక్క‌డ పోటీ చేస్తున్నారు. స‌హ‌కారం ఏమైనా అందిస్తారా..?
ఎవ‌డ‌య్యా బుర్ర లేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవ‌రు..? గురువు ఎవ‌రు..? నేను స‌హ‌చరుడిని అని చెప్పిన‌. ఎవ‌డ‌న్న బుద్ది లేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్ర‌బాబు నాయుడు పార్టీ అధ్య‌క్షుడు. నేను ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను స‌హ‌చ‌రుడిని.

RELATED ARTICLES

తాజా వార్తలు