Ranveer Singh- Deepika Padukone| ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు చిన్నా చితకా విషయాలకి విడాకులు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రేమించి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకొని ఏవో కారణాల వలన వారు విడాకులు తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగ చైతన్య- సమంత విడాకుల విషయంలో ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకోబోతుందనే టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రేమించి పెళ్లి చేసుకోగా, వీరిద్దరు ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. దాంతో వారి విడాకుల విషయం వైరల్‌గా మారింది. ఈ మధ్య సెలబ్రిటీలు విడాకులకి ముందు సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోల డిలీట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రణ్‌వీర్ కూడా పెళ్లి ఫొటోలు ఒక్కటి కూడా లేకుండా డిలీట్ చేయడంతో వారిద్దరు విడాకులు తీసుకోవడం ఖాయం అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. దీపిక ఇన్‌స్టాలో మాత్రం పెండ్లి ఫొటోలు అలానే ఉన్నాయి. రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెండ్లి ఫొటోలు మాత్రమే తొలగించబడ్డాయి. మరోవైపు రణ్‌వీర్- దీపికతో కలిసి ఉన్న మిగతా ఫొటోలు అలాగే ఉన్నాయి.అయితే ఏదో పొరపాటు వలన ఆ పిక్స్ తొలగించబడి ఉంటాయి తప్ప వారిద్దరు విడాకులు తీసుకునే అవకాశం లేదని కొందరు అంటున్నారు.
దీపిక ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తుండగా, ఇలాంటి సమయంలో రణ్‌వీర్ ఆమెని ఎలా వదిలేస్తాడని కొందరు చెప్పుకొస్తున్నారు. దీనిపై రణ్‌వీర్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం ఏంటో జనాలకి తెలియదు. ఇక దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఒకరినొకరు ప్రేమించుకొని నవంబర్ 2018 లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్నారు. దీపిక త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నాడు.