KCR | ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలపేరుతో రేవంత్ రెడ్డి జనాలను మోసం చేశారని ధ్వజమెత్తుతున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండే అని జనాలు కోడై కూస్తున్నారు. నేను చనిపోయే దాకా కేసీఆర్‌కే ఓటేస్తాను అని ఓ వృద్ధురాలు శపథం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మాకు ఫ్రీ బస్సు వద్దు.. ఈ ఫ్రీ బస్సుతో ముసలోళ్ల కాళ్లు, చేతులు విరిగిపోతున్నాయని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తామన్నారు. కానీ 1050 వసూళ్లు చేసినట్లు వాపోయారు. 4 వేల పెన్షన్ అన్నడు.. కానీ అది రావట్లేదు. కేసీఆర్ ఇచ్చే 2 వేల పెన్షన్ బాగుండే అని ఆమె పేర్కొన్నారు.
మరో వృద్ధురాలు మాట్లాడుతూ.. నేను చనిపోయే దాకా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌కు తప్ప ఇంకొకరికి ఓటు వేయను. ఇదే నా శపథం. పదేండ్ల నుంచి కేసీఆర్ ఆదుకున్నాడు. ఇప్పుడు ఈయన(రేవంత్) రాగానే ఓటు వేయాల్నా..? పదేండ్ల నుంచి బువ్వ పెట్టినోడిని వదులకుని.. ఇవాళ వంద ఇస్తామంటే ఈయనకు ఓటేయాల్నా..? ఆ వందకు ఆశపడితే ఇన్ని రోజులు తిన్న రుణం ఏడికి పోవాలి. రుణం తీరొద్దా అని ఆ వృద్దురాలు అన్నారు.
మాకు ఫ్రీ బస్సు వద్దు
ఈ ఫ్రీ బస్సుతో ముసలోళ్ల కాళ్లు చేతులు ఇరుగుతున్నాయి..
కేసీఆర్ ఉన్నపుడే మా పెన్షన్ టైంకి వచ్చేది.. మా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌కే ఓటేస్తాం.
సూర్యాపేట ప్రచారంలో భాగంగా వెళ్లిన సునీత జగదీష్ రెడ్డితో ఈ ప్రభుత్వంలో బాధలు పడుతున్నామని వృద్ధుల ఆవేదన. pic.twitter.com/RkavpQOf8a
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024