Thursday, April 3, 2025
HomeCinemaSatya Sri | శేఖర్‌ మాస్టర్‌ చెప్పడంతోనే ఆ సాంగ్‌లో నటించా.. జబర్దస్త్‌ ఫేమ్‌ సత్యశ్రీ

Satya Sri | శేఖర్‌ మాస్టర్‌ చెప్పడంతోనే ఆ సాంగ్‌లో నటించా.. జబర్దస్త్‌ ఫేమ్‌ సత్యశ్రీ

Satya Sri | నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే, మూవీలోని పాట తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఓ పాట మొత్తం బూతులా ఉందని.. చిత్రంలో ఆ పాటకు అమ్మాయిలతో స్టెప్పులేయించడమేంటని పలువురు విమర్శించారు. ఈ సాంగ్‌లో జబర్దస్త్‌ ఫేమ్‌, నటి సత్యశ్రీ నటించింది. ఈ పాటలో నటించేందుకు సత్యశ్రీ ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ సాంగ్‌ను చేయడం వెనుక జరిగిన కథను తాజాగా సత్యశ్రీ వెల్లడించింది. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ వల్లే ఆ సాంగ్‌ని చేయాల్సి వచ్చిందని చెప్పింది. సినిమాకు ఓకే చెప్పినప్పుడు కేవలం ఓ సిచ్చువేషన్‌ సాగు ఉంటుందని మాత్రమే చెప్పారని.. పాట షూటింగ్‌ సమయం వచ్చిన సమయంలోనే అసలు సంగతి తెలిసిందని చెప్పుకొచ్చింది. ఆ పాట చేయడం తనకు ఇష్టం లేదని.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం.. అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన చెప్పడంతోనే చేశానని చెప్పింది. ఇబ్బందిగానే ఆ సాంగ్‌లో నటించానని సత్యశ్రీ పేర్కొంది.

RELATED ARTICLES

తాజా వార్తలు