Kavya Maran | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఫైనల్‌లో అడుగుపెట్టింది. దాంతో ఆ జట్టు యాజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సన్‌రైజర్స్ జట్టు ప్రదర్శనకు అనుగుణంగా భావోద్వేగాలకు గురయ్యే కావ్య ముఖ్యం ఈ సారి మాత్రం వెలిగిపోయింది. సన్‌రైజర్స్ ఎట్టకేలకు ఫైనల్‌కు దూసుకెళ్లడంతో సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ గెలిచిన అనంతరం సన్‌రైజర్స్ శిబిరంలోని సభ్యులతో కరచాలనం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కూడా ఆరేళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్ చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కప్పు కొట్టాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. సీజన్‌లో ఆద్యాంతం అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ జట్టుతో పాటు అభిమానులు నిరాశే ఎదురైంది. పలువురు అభిమానులు కంటతడిపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కాగా, సన్‌రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్స్ విఫలమయ్యారు. ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులేమీ చేయలేకపోయారు. తక్కువ లక్ష్యం ఉన్నా సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బంతులు విసిరి మ్యాచ్‌ను కాపాడుకున్నారు. ఆల్‌రౌండర్ షాబాజ్ ఖాన్ 3 కీలకమైన వికెట్లు తీశాడు. అభిషేక్ వర్మ రెండు వికెట్లతో పడగొట్టాడు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY
— JioCinema (@JioCinema) May 24, 2024