కృత్తిమ మేధ(AI) లో మనమెక్కడ ?
కృత్తిమమేధ సంసిద్ధతా సూచిక(Artificial Intelligence Preparedness Index) ను ఐఎమ్ఎఫ్ విడుదల చేసింది. మొత్తం 174 దేశాలలో భారతదేశం 72 వ స్థానంలో ఉంది. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హుమన్ క్యాపిటల్, లేబర్ మార్కెట్ పాలిసీస్, ఇన్నోవేషన్ – ఎకనామిక్ ఇంటిగ్రేషన్ – రెగులేషన్ అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా ఆయా దేశాల ర్యాంకులను నిర్ణయించారు. అడ్వాన్స్ డ్ ఎకానమీ(ఎఇ), ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ (ఇఎమ్), లో ఇన్ కమ్ కంట్రీ (ఎల్ ఐ సీ) అనే మూడు విభాగాలుగా దేశాలను ఐఎమ్ఎఫ్ వర్గీకరించింది. భారత్ ను ఇఎమ్ కాటగిరి లో చేర్చింది. భారత్ 0.49 రేటింగ్ తో 72 వ స్థానంలో ఉంది. సింగపూర్, డెన్ మార్క్, అమెరికా, నెదర్లాండ్స్, ఈస్టోరియా, ఫిన్ లాండ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, స్వీడన్ వరుసగా ఎఇ కాటగిరిలో మొదటి పది స్థానాలలో ఉన్నాయి.