Friday, January 3, 2025
HomeBusinessAirtel | యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎయిర్‌టెల్‌.. ఆ మూడు ప్లాన్స్‌పై ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌..!

Airtel | యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎయిర్‌టెల్‌.. ఆ మూడు ప్లాన్స్‌పై ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌..!

Airtel | ప్రముఖ టెలికం కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ తన యూజర్లకు శుభవార్త వినిపించింది. మొబైల్‌ రీచార్జ్‌ ప్లాన్స్‌ కింద ‘నెట్‌ఫ్లిక్స్‌’ సబ్‌స్క్రిప్షన్‌ని ప్రకటించింది. ఓ ప్రీపెయిడ్ ప్లాన్, రెండు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రూ.1,199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ కింద నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నది. రూ.1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లోనూ సైతం ఇవే ఓటీటీలను అందిస్తున్న విషయం తెలిసిందే.

రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 100 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను ఎయిర్‌టెల్‌ ఆఫర్ చేస్తుంది. అదనంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ సేవలు, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్స్‌ని పొందవచ్చని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇక రూ.1,199, రూ.1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో 5జీ అపరిమిత డేటా లభిస్తుందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

వాస్తవానికి నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు భారతీయ యూజర్లకు ఎక్కువగానే ఉంటున్నాయి. మిగతా ప్లాట్‌ఫామ్స్‌తో పోలిస్తే ఎక్కువ ఉంటుండగా.. వార్షిక ఆఫర్లు ఉండడం లేదు. కేవలం నెలవారీగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కాబట్టి మొబైల్ రీఛార్జ్‌ ప్లాన్స్‌పై నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లకు ఇస్తుండడం మంచి విషయమే. భారత్‌లో భారతి ఎయిర్‌టెల్ 380 మిలియన్ల మంది యూజర్లున్నారు.

Read Also :

Navneet Kaur Rana | చిక్కుల్లో అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌.. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

Curry Leaves | క‌రివేపాకు రోజూ తింటే ఏమ‌వుతుంది? మ‌న‌కు లాభామా? న‌ష్ట‌మా?

RELATED ARTICLES

తాజా వార్తలు